Header Banner

అఘోరీ మాయలు విఫలమయ్యాయ్… నేరారోపణలతో కోర్టు ముందుకు! అసలు నిజాలు బహిర్గతం!

  Wed Apr 23, 2025 18:48        Others

ప్రత్యేక పూజల పేరుతో ఓ మహిళ నుంచి రూ.10 లక్షలు వసూలు చేసి మోసగించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అఘోరీకి చేవెళ్ల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అఘోరీని అదుపులోకి తీసుకుని, అనంతరం కోర్టు ముందు హాజరుపరిచారు. వివరాల్లోకి వెళితే, ఓ మహిళ తన సమస్యల పరిష్కారం కోసం అఘోరీని ఆశ్రయించారు. ప్రత్యేక పూజలు చేస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్మించిన అఘోరీ, సదరు మహిళ నుంచి దశలవారీగా సుమారు రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే, ఎంతకాలమైనా తన సమస్యలు తీరకపోవడం, అఘోరీ ప్రవర్తనపై అనుమానం రావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు, అఘోరీని అదుపులోకి తీసుకున్నారు.


ఇది కూడా చదవండి: లేడీ అఘోరీ అరెస్ట్ – మాయ మాటలతో 10 లక్షల మోసం బట్టబయలు! నగ్న పూజల పేరుతో..!


అనంతరం ఆమెను చేవెళ్ల కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ప్రాథమిక ఆధారాలు, వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, అఘోరీకి రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో అఘోరీని సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. ఈ సందర్భంగా అఘోరీ మాట్లాడుతూ, తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉందని, తాను పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని తెలిపింది. కాగా, అఘోరీ ఇటీవల వర్షిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరినీ పోలీసులు మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండగా గుర్తించారు. అఘోరీని అదుపులోకి తీసుకుని నార్సింగి పీఎస్ కు తరలించారు. మరోవైపు, వర్షిణిని కౌన్సిలింగ్ సెంటర్ కు తరలించినట్టు తెలుస్తోంది.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


నాలుగు గోడల వెనుక కాదు… జ‌గ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడు! హోంమంత్రి అనిత సవాల్!


స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తరహాలో ఎన్టీఆర్ భారీ విగ్రహం! ఆ ప్రాంతంలోనే! ఎన్ని అడుగులంటే..


సమంత చేతిలో నూతన ఉంగరం... రహస్యంగా ఎంగేజ్‌మెంట్! సోషల్ మీడియాలో వైరల్!


వేసవిలో రైల్వే ప్రయాణికులకు ఊరట.. దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన! 30కి పైగా స్పెషల్ ట్రిప్పుల పొడిగింపు!


చంద్రబాబు అమిత్ షా భేటీలో కీలక నిర్ణయం! ఏపీ రాజ్యసభ స్థానం బీజేపీదే! ఎవరంటే?


మన వార్డు - మన ఎమ్మెల్యే కార్యక్రమం.. తక్షణ ఈ చర్యలు తీసుకోవాలని..


చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ గ్రీవెన్స్ కార్యక్రమంలో మార్పులు! ఇక నుంచి ఆ రోజు ఫిర్యాదుల స్వీకరణ!


ఆస్ట్రేలియా విద్యార్థి వీసా విధానంలో సంచలన మార్పులు! ప్రపంచ విద్యార్థులకు షాక్!


ముగిసిన రాజ్ కసిరెడ్డి సిట్ విచారణ! దాదాపు 12 గంటల పాటు.. ఇక అరెస్టుల పర్వం మొదలవుతుందా?


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #AghoriArrested #FraudExposed #CourtDrama #10LakhScam #FakeRituals #JusticePrevails